MLC Kavitha : తెలంగాణ ప్రభుత్వం నీటి విషయంలో రాజకీయాలు చేయడం తగదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘నీళ్లు – నిజాలు’’ అనే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె, నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశారని, మిగిలి ఉన్న…
Uttam Kumar Reddy : కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని కాంగ్రెస్ పార్టీ తొలినుంచి పోరాటం చేస్తూ వస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో తొలి పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైంది.…
MLC Kavitha : తెలంగాణలో బీడుగా మారిన భూములకు కృష్ణా జలాలను మళ్లించే క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి సత్ఫలితాలను అందించిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కవిత తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “కృష్ణా జలాల్లో మా వాటా మాకే” అనే కేసీఆర్ పోరాటం విజయవంతమై, దీని ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య…
ఇవాళ సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కేంద్ర శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కృష్ణ జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ఈ అంశంపై కేసీఆర్ సర్కార్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నందున మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పామన్నారు. దీంతో రెండు రోజుల్లో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని తెలిపి.. 8 నెలలకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. పిటిషన్…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా…
నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నీళ్లు చేతులారా వదులుతున్నాడు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు.. నిధులు ఎలాగో లేవు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసాడని ఆరోపించాడు. రంగారెడ్డికే కాదు.. పశ్చిమ తెలంగాణకి చుక్క నీరు రానివ్వకుండా చేసాడు. రాష్ట్రానికి దరిద్రం పట్టుకోవడం కాదు…కేసీఆర్ కుటుంబం పట్టుకుందని విమర్శలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడిస్తామని తేల్చి చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల…
కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై టీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ విమర్శించారు. ఇన్నాళ్లుగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్‌తో కుమ్మక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణను విస్మరించారని ఆమె ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను కేఆర్ఎంబీ నిలిపేస్తుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు ముఖ్యమంత్రి జగన్ వేరు వేరుగా లేఖ రాశారు. తెలంగాణతో ఉన్న జల పంచాయతీ పై ప్రధాని మోడీకి ఐదు పేజీల లేఖ రాశారు జగన్. అంతేకాదు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కో కు రాసిన లేఖ, విద్యుత్ ఉత్పత్తి కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన…
రాయలసీమ ఎత్తిపోతల పేరిట పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ తీవ్ర విమర్శలకు గురవుతున్నది. దీనిపై కృష్ణాజలాల సంఘానికి లేఖ రాయగా.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలిచ్చారు. అయితే, గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్‌లతో కేంద్ర నీటిపారుదల మంత్రి గజేంద్ర షెకావత్ జరిపిన తొలిసమావేశంలోనే ఇరు రాష్ట్రాల అనధికార ప్రాజెక్టులను నిలిపేయాలని పూర్తి వివరాలుండే డిపిఆర్లు సమర్పించి ఆమోదం పొందిన తర్వాతనే ముందుకు సాగాలని నిర్ణయించారు. అయితే…