TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించరాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటమి గెలుపుకు నాంది అని పేర్కొన్నారు. పాలకుల్లో అప్పుడే అసహనం కనిపిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి అహంకారం ఎక్కువైందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ రోజు నల్గొండను ముంచి పులిచింతల ప్రాజెక్ట్ కట్టారని.. ఇప్పుడు కృష్ణాను కేఆర్ఎంబీకి అప్పగించారని హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చిత్తశుద్ది…
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు…
ఇవాళ సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
Minister KTR: హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంటుందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
కృష్ణానదీ తీరంలో నాగ ప్రతిమలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సమీపంలో కృష్ణానది కరకట్ట దిగువన నాగ ప్రతిమలు పదుల సంఖ్యలో కనబడుతున్నాయి. సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలీదుగానీ భారీగా వెలుగు చూశాయి.