కృష్ణా జిల్లాలోని గుడివాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మహిళను దారుణంగా హత్య చేసిన ఈ ఘటన గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో జరిగింది.
కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. పాములలంకకు చెందిన పాముల విజయాంభ, పాముల చిరింజీవిగా గుర్తించారు.
పెడన పోలీసు స్టేషన్ పరిధిలో తోటమూల సెంటరులో జనసేన బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేశారు అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైన పూర్తి పరిశీలన చేశాం.. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా అయ్యంకిలో మరోసారి ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో భార్యాభర్తలను దారుణంగా హత్య చేశారు. పాత కక్షలు నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి అనే మహిళను నడిరోడ్డుపైన చంపేశారు. ఈమె భర్త వీరంకి వీర కృష్ణను పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణంగా హత్య చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ తీర్మానం సందర్భంగా గ్రామ పెద్ద మనుషులు చెప్పిన మాట వినలేదని రెండు కుటుంబాలను గ్రామం నుంచి వెలి వేశారు.