Off The Record: జనసేన లిస్ట్‌లో ఆ నాలుగు సీట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జనసేన క్యాడర్, లీడర్స్‌లో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఇక అదే ఊపులో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సీట్లపై కూడా కసరత్తు మొదలైందట. టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమైనట్టేనని ప్రచారం జరుగుతున్నందున… దాన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణాజిల్లా విషయంలో క్లారిటీ వచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం జనసేనకు ఎక్కడెక్కడ బలం ఉంది? ఏయే సీట్లలో పోటీ చేస్తే విజయం సాధిస్తామన్న లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఉమ్మడి కృష్ణాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో నాలుగు సీట్లలో గట్టిగా పోటీ చేయాలని అనుకుంటోందట జనసేన.
2019 ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి బరిలో దిగిన జనసేన 8 సీట్లలో పోటీ చేసింది. జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ, అవనిగడ్డ, పెడన, మచిలీ పట్నం, కైకలూరులో నాడు పోటీ చేసింది గ్లాస్ పార్టీ. కానీ… నాలుగు చోట్ల మాత్రమే కాస్త ప్రభావం చూపగలిగింది. విజయవాడ పశ్చిమ, తూర్పు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లో 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఐదేళ్ళలో మారిన రాజకీయ పరిస్థితులను బట్టి జిల్లాలో 5 కంటే ఎక్కువ సీట్లు అడగాలని అనుకుంటున్నా.. సాధ్యం కాని పరిస్థితుల్లో గత ఎన్నికల్లో 15 శాతం ఓట్లు వచ్చిన ఆ నాలుగు సీట్ల కోసం గట్టిగా పట్టుబట్టాలని అనుకుంటున్నారట జిల్లా నాయకులు. అధినేత పవన్ మీద కూడా ఈ దిశగానే వత్తిడి తేవాలనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో బెజవాడ పశ్చిమలో 23 వేల ఓట్లు పడితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేనకు అదే స్థాయిలో ఓట్లు రావడాన్ని గుర్తు చేస్తున్నారు నాయకులు.
Also Read
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
ఇక పెడన, అవనిగడ్డలో కూడా 25వేల దాకా ఓట్లు వచ్చాయి. ఈ రెండు సీట్లలో ఖచ్చితంగా పోటీ చేద్దామని జనసేన అధినాయకత్వం పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేసిందట. చివరిగా విజయవాడ సెంట్రల్ సీటు స్థానం వంగవీటి రాధా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. రాధా జనసేనలో చేరే అవకాశం ఉందన్న అంచనాలున్నాయని, అదే జరిగితే…ఆయన ఖచ్చితంగా సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని, అప్పుడు ఆ సీటు కూడా తమ ఖాతాలో పడుతుందని లెక్కలేసుకుంటున్నారట జిల్లా నాయకులు. పొత్తులంటూ… అధికారికంగా ఖారయ్యాక ఈ లెక్కలన్నీ ఎలా మారతాయో చూడాలి.
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!