Atrocious act: ముగ్గురు ఎస్టీ మహిళలపై యజమాని పైశాచిక దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచిక దాడికి దిగాడు. రెండు రోజులు బందీలుగానే బాధితులు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా.. మోపిదేవి ఎస్ఐ తమ గోడు వినలేదని బాధితులు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దయనీయ స్థితిలో బాధితులు ఉన్నారు.
Read Also: Atrocious: పోలీస్ ఉద్యోగంలో భార్య బిజీ.. బేజారై హత్యచేసిన భర్త..
Also Read
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజాబాబు అనే వ్యక్తి తమ ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ కొద్ది రోజులు ఇంటి పని చేయాలంటూ అదే గ్రామానికి చెందిన దుర్గ అనే ఎస్టీ యానాది కులానికి చెందిన 18 ఏళ్ల యువతిని పనికి పిలిచి ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తప్పుడు నేరం వేస్తూ మైనర్ బాలిక పై పైశాచిక దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాలిక తలకు రక్త గాయం ఒళ్లంతా తీవ్ర గాయాలు కావడంతో కేసు అవ్వకుండా తప్పించుకోవాలని ప్లాన్ చేసి బలవంతంగా నేరాన్ని ఒప్పించి ఆ నేరాన్ని దుర్గ పిన్ని అయిన పద్మ, దుర్గ అమ్మమ్మ అయిన రమణ మీద కూడా కేసు పెట్టి.. మరోమారు పోలీసులతో కొట్టించిన వైనం మోపిదేవిలో చోటుచేసుకుంది.
Read Also: Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు..
యజమాని కొట్టిన దెబ్బలతో ఉన్నవారిని కనీసం కనికరం చూపించకుండా మరో మారు మోపిదేవి ఎఎస్ గాయపరిచింది అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలకు గాయమై రక్తం కారుతున్న వైద్యం చేయించని పోలీసులు.. ఆస్పత్రికి వెళితే వారి ఇల్లు తగలబెడతామంటూ మరింతగా భయపెట్టిన యజమాని మత్తి రాజబాబు.. దిక్కు తోచక గత్యంతరం లేక గాయాలు నొప్పులు భరించలేక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్యం మాత్రమే చేయండి కేసు పెడితే మా దొర చంపేస్తాడు అంటూ ఆస్పత్రి బయట రోడ్డుపై పడుకోవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మాల మహానాడు కృష్ణాజిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ బాధితులను పరామర్శించి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని వారికి వైద్య సాయం ఇప్పించడంతో పాటు నేరం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!