Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..
- కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం..
- ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం.. తీవ్రంగా గాయపడిన ఐదుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున రహదారి నెత్తురోడింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ హస్పటల్ కు తరలించారు. రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్‌ది కాగా.. అతని పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
Read Also: Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ఫహాద్ ఫాజిల్..?
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. రొయ్యల ఫీడ్‌తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తుండగా.. బొలెరో వ్యాన్ తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వైపుకు వెళ్తుంది. అయితే, పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో కంటెయినర్‌కు ఢీ కొట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆ సంఘటన ప్రదేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు మూడు కిలో మీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!