Sushila Karki: నేపాల్‌లో కొత్త శకం మొదలైంది. హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్-జెడ్ నిరసనకారులు చేసిన ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్-జెడ్ ప్రతినిధులు, ఆర్మీ, అధ్యక్షుడితో జరిపిన చర్చల్లో సుశీల కర్కీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆమె చేత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయించారు.
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువతి చేపట్టిన ఆందోళనల తర్వాత ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలో చాలా మంది రాజీనామాలు సమర్పించారు. అయితే, నేపాల్‌కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీలా కర్కీ ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది.
Nepal unrest: రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చాలా మంది మంత్రలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, అల్లర్లలో చాలా మంది లూటీలకు తెగబడ్డారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 51 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక భారతీయురాలు కూడా ఉంది.
China Statement Nepal Crisis: నేపాల్‌లో కొనసాగుతున్న గందరగోళం, తిరుగుబాటుపై చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లోని అన్ని పార్టీలు సమిష్టిగా ఉండి.. దేశీయ సమస్యలను పరిష్కరించుకోవాలని, సామాజిక క్రమం, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని చైనా కోరింది. నేపాల్ పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తొలిసారి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "చైనా, నేపాల్ దేశాలు సాంప్రదాయక, స్నేహపూర్వక పొరుగు సంబంధాలను కలిగి ఉన్నాయి.
Nepal Protest: నేపాల్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై ప్రభుత్వం బ్యాన్ విధించడంతో ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా యువత ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తోంది. సోమవారం కాల్పుల్లో 19 మంది ఆందోళనకారులు చనిపోవడంతో, హింసాత్మక దాడులు పెరిగాయి. ఆగ్రహావేశాలకు గురైన ప్రజలు రాజకీయ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ప్రధాని కేపీ శర్మ ఓలి ఇంటితో పాటు అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రిని వీధుల్లో తరుముతూ దాడి చేసిన వీడియో వైరల్‌గా…
Balendra Shah: సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. జెన్-జీ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన కాల్పుల్లో 19 మంది ఆందోళనకారులు మరణించడంతో, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Nepal Gen Z protests: నేపాల్‌లో సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రాజధాని ఖాట్మాండుతో పాటు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు అంటుకున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సోమవారం 19 మంది ఆందోళనకారులు చనిపోయిన తర్వాత, హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు ఇళ్లతో పాటు సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు.
Nepal Protest: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా, నేపాల్‌లో యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఆందోళన హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. సోమవారం, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది ఆందోళకారులు మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
Nepal Protests: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా నేపాల్ అట్టుడుకుతోంది. జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతునున్నారు. ఈ నిరసన హింసాత్మక చర్యలకు దారి తీసింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు అధ్యక్షుడి నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడులు చేసి, నిప్పటించారు.