Nepal Gen Z protests: నేపాల్‌లో సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రాజధాని ఖాట్మాండుతో పాటు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు అంటుకున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సోమవారం 19 మంది ఆందోళనకారులు చనిపోయిన తర్వాత, హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు ఇళ్లతో పాటు సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు.
Read Also: Salman Lala: గ్యాంగ్‌స్టర్ అంత్యక్రియలు వేలాది మంది.. బాలివుడ్ నటుల సంతాపం.. ఇంతకీ ఎవరితను?
ఇదిలా ఉంటే, నేపాల్ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజీనామా చేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు కూడా విదేశాలకు వెళ్లేందుకు ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. రెండు రోజులుగా కొనసాగుతున్న నిరసనల్లో 22 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించారు.