Sushila Karki: నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువతి చేపట్టిన ఆందోళనల తర్వాత ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలో చాలా మంది రాజీనామాలు సమర్పించారు. అయితే, నేపాల్‌కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది. జెన్-జెడ్ యువ ప్రతినిధులు ఈమె పేరును ప్రధానిగా సిఫారసు చేశారు. ఆర్మీ, అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో అత్యున్నత పదవి కోసం కర్కీని ఎంచుకున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆమె పదవీ బాధ్యతలు చేపడుతారని తెలుస్తోంది.
Read Also: Venkaiah Naidu : బ్రహ్మానందం కనిపిస్తేనే నవ్వొస్తుంది.. ఆత్మకథ పుస్తకం ఆవిష్కరించిన వెంకయ్య..
జెన్-జెడ్ నిరసనకారులు, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ మధ్య ఏకాభిప్రాయం తర్వాత కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. కేర్ టేకర్ ప్రభుత్వానికి చిన్న మంత్రివర్గం ఉంటుందని, మొదటి సమావేశం శుక్రవారం రాత్రి జరుగుతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఏడు ప్రాంతీయ పార్లమెంట్‌లతో పాటు ఫెడరల్ పార్లమెంట్‌ను రద్దు చేయాలని మంత్రి వర్గం సిఫారసు చేసే అవకాశం ఉంది.