Nepal Protest: నేపాల్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై ప్రభుత్వం బ్యాన్ విధించడంతో ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా యువత ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తోంది. సోమవారం కాల్పుల్లో 19 మంది ఆందోళనకారులు చనిపోవడంతో, హింసాత్మక దాడులు పెరిగాయి. ఆగ్రహావేశాలకు గురైన ప్రజలు రాజకీయ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ప్రధాని కేపీ శర్మ ఓలి ఇంటితో పాటు అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రిని వీధుల్లో తరుముతూ దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. పరిస్థితి చేజారిపోతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజీనామా చేశారు.
Read Also: CM Revanth Reddy : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ
ఇదిలా ఉంటే, రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులను టార్గెట్ చేస్తూ ఆందోళనకారులు దాడులకు తెగబడుతున్నారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, అతడి భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్‌బాపై నిరసనకారులు దాడులు చేశారు. ఖట్మాండులోని బుడానిల్కాంతలోని దేవ్‌బా నివాసంలోకి చొరబడిని ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మాజీ ప్రధానికి తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం అయింది. దేవ్‌బా, అర్జులను రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది.
కోపంతో ఉన్న యువత రాజకీయ నాయకులు, క్యాబినెట్ మంత్రుల నివసాలను, అధికారిక భవనాలను తగలబెట్టారు. మరో మాజీ ప్రధాని మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పటించారు. ఇంటిలో ఉన్న ఆయన భార్య కాలిన గాయాలతో మరణించారు. మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మీ చిత్రాకార్ మంగళవారం సజీవదహనం అయ్యారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. నిరసనకారులు ఆమెను తన ఇంట్లో బంధించిన ఇంటికి నిప్పటించారు. ఈ సంఘటన రాజధాని ఖాట్మాండులోని డల్లు ప్రాంతంలో జరిగింది. చిత్రకర్‌ను కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
Sher Bahadur deuba escorted by the army https://t.co/JLuM9DOhqK pic.twitter.com/Ilv3Ji9Qhe
— Lørd (@lord1769) September 9, 2025