Nepal unrest: భారత పర్యాటకుల బస్సుపై దాడి, దోపిడి..
- నేపాల్‌లో భారతీయ పర్యాటకులపై దాడి..
- పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ల వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal unrest: రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చాలా మంది మంత్రలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, అల్లర్లలో చాలా మంది లూటీలకు తెగబడ్డారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 51 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక భారతీయురాలు కూడా ఉంది.
ఇదిలా ఉంటే, ఖాట్మాండ్ లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్న భారతీయ యాత్రికుల బృందంపై గురువారం దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి బస్సు భారతదేశానికి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. దుండగులు బస్సుపై రాళ్లు విసిరి, అద్దాలనుు పగలగొట్టారు. బ్యాగులు, నగలు, నగదు, మొబైల్ ఫోన్‌లతో సహా ప్రయాణికుల వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు. ఈ సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Also Read
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
ఈ ఘటనపై బస్సు డ్రైవర్ రాజ్ మాట్లాడుతూ.. దాడి చేసిన వాళ్లు రాళ్లతో బస్సు అద్దాలను పగలగొట్టి మా వస్తువులను దోచుకెళ్లారని చెప్పారు. ఏడెనిమిది మంది ప్రయాణికులు గాయపడినట్లు చెప్పారు. అయితే, వెంటనే నేపాల్ సైనిక సిబ్బంది ప్రయాణికులను రక్షించినట్లు వెల్లడించారు. దెబ్బతిన్న బస్సు గురువారం సాయంత్రం యూపీలోని మహారాజ్‌గంజ్ సమీపంలోని సోనౌలి సరిహద్దుకు చేరుకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను పెంచారు. నేపాల్‌లో అశాంతి కారణంగా యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వద్ద భద్రతను హై అలర్ట్‌లోఉంచారు. సరిహద్దు వెంబడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!