Sushila Karki: నేపాల్‌లో కొత్త శకం మొదలైంది. హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్-జెడ్ నిరసనకారులు చేసిన ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్-జెడ్ ప్రతినిధులు, ఆర్మీ, అధ్యక్షుడితో జరిపిన చర్చల్లో సుశీల కర్కీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆమె చేత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయించారు.
Read Also: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్.. హత్య చేసింది ఇందుకేనా..
ప్రమాణం చేసిన వెంటనే, కర్కీ తన ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిచారు. మార్చి 4, 2026న కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకుని, అత్యవసర పరిస్థితి విధించాలని సిఫారసు చేసే అవకాశం ఉన్టన్లు సమచారం. కేబినెట్ సిఫారసు తర్వాత, అధ్యక్షుడి ఆమోదం పొందితే, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులోకి వస్తుంది.
అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొంది. సోమవారం ప్రారంభమైన నిరసనల్లో, భద్రతా బలగాల కాల్పుల్లో 19 మంది మరణించడంతో, హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి ఇళ్లు, పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. నిరసనలు పెద్దవి అవుతుండటంతో ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిరసనల్లో మొత్తం 51 మంది మరణించారు.
#WATCH | Kathmandu | Nepal's former Chief Justice, Sushila Karki, takes oath as interim PM of Nepal
Oath administered by President Ramchandra Paudel
Video source: Nepal Television/YouTube pic.twitter.com/IvwmvQ1tXW
— ANI (@ANI) September 12, 2025