విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీనీ కలపడంతో జనసేన సఫలీ కృతమైంది.
పీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నట్లు తెలిసింది.