Off The Record: టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఆ నియోజకవర్గ రాజకీయం మారిపోయిందా? జనసేన ఎమ్మెల్యేతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ వర్గం సొంత నాయకుల మీదే కత్తులు దూస్తోందా? అవకాశాల కోసం దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టిన ఇద్దరు సీనియర్స్… రెండేళ్ళు తిరక్కముందే పాత పగల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా? ఎక్కడ జరుగుతోందా ఎపిసోడ్? ఎవరా ఇద్దరు నాయకులు?
ఆంధ్రప్రదేశ్ కూటమిలో కుంపట్లు అంటుకోవడం మొదలై చాలా రోజులైంది. పై స్థాయిలో, పెద్ద నాయకులంతా పరస్పరం పొగుడుకుంటూ… మనం మనం బరంపురం అంటున్నా… నియోజకవర్గ లెవల్‌లో మాత్రం చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట టీడీపీతో ఆధిపత్యపోరు ఎక్కువగా ఉంటోంది. పిఠాపురం నుంచి పాలకొండ దాకా… అదే సీన్. కొన్ని చోట్ల అతికష్టం మీద సర్ధుబాట్లు సాధ్యమైతే… మరికొన్ని చోట్ల టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.
Off The Record: కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి మళ్లీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం రీస్టార్ట్..!
అదంతా ఒక ఎత్తయితే… వీటన్నిటికీ భిన్నమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి అనకాపల్లిలో. జనసేన ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం రాజకీయం రెండు ఫ్యామిలీల చుట్టూ తిరుగుతోంది. మాజీ మంత్రి, సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా… మాజీ ఎమెల్యే పీలా గోవింద్ టీడీపీ ఇన్చార్జ్. సీట్ల సర్ధుబాటు వల్ల టిక్కెట్ ఇవ్వలేనందుకు ప్రతిగా.. రాష్ట్ర స్ధాయి కార్పొరేషన్ పదవితో పాటు నియోజకవర్గ బాధ్యతలు గోవింద్ చేతుల్లో పెట్టింది టీడీపీ హైకమాండ్. అటు గోవింద్, కొణతాల ఇద్దరూ వరుసకు వియ్యంకులు. ఇటీవలి కాలంలో కుటుంబ బంధాలు మరింత బలపడిన క్రమంలో వియ్యంకుల మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఫర్ఫెక్ట్‌గా ఉందట.
మిత్రపక్షాల మధ్య అవగాహన ఉంటే మంచిదేగా… అది చూసి వేరే వాళ్ళకు ఎందుకు అంత ఎసిడిటీ? అనుకుంటున్నా? క్వశ్చన్ కరెక్టేగానీ… అసలు కథ మాత్రం అక్కడే స్టార్ట్ అవుతోందట. అనకాపల్లి రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఎదిగిన మాజీ మంత్రి దాడివీరభద్రరావు వర్గం ఇటీవల నియోజకవర్గ ఇన్చార్జ్ తో విభేదిస్తోంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధి అయిన కొణతాలతో కూటమి ధర్మం ప్రకారం ఎన్నికల ముందు చేతులు కలిపారు వీర భద్రరావు. ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్న పరిస్ధితుల నుంచి కొణతాల విజయం కోసం దాడి ప్రచారం చేయాల్సిన పరిస్ధితులు రావడం రాజకీయ అవసరమే. ఐతే, ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే టీడీపీ ఇన్చార్జ్ పీలా… ఎమ్మెల్యేతో కలిసిపోయారనే అభిప్రాయం దాడి వర్గంలో బలంగా నాటుకుపోయింది. ఈ తరహా రాజకీయాలు దీర్ఘకాలంలో పార్టీకి నష్టం కలిగిస్తాయని బలంగా విశ్వసిస్తున్నారట దాడి.
దీన్ని ఎదుర్కొనే క్రమంలోనే స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారన్న అభిప్రాయం ఉంది. నియోజకవర్గం అంతా ఎమ్మెల్యే అల్లుడు చేతుల్లోకి వెళ్ళిపోయిందని…..ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తే.. సహించాల్సిన అవసరం లేదని, ఇక్కడ కూటమి నేతల మాటకు విలువ లేకుండాపో యిందని బహిరంగ వేదికపైనే ఫైర్ అయ్యారు దాడివీరభద్రరావు. దీంతో…ఎన్నికల ముందు చేతులు కలిపి కొత్త అధ్యాయానికి కారణం అయ్యారని భావించిన దాడి, కొణతాల వర్గాల మధ్య మళ్ళీ గ్యాప్ పెరిగిందనే ప్రచారం మొదలైంది. అటు, పీలా గోవింద్ సైతం మాజీ మంత్రి మనుషుల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదట.
దీంతో టీడీపీలో వర్గ రాజకీయాలు ఊపందుకోగా ఇటీవలనేరుగా సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్‌లో చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చారు. అధికారిక కార్యక్రమాల తర్వాత నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష జరిగింది. అనకాపల్లి దగ్గరకు వచ్చేసరికి మీటింగ్ బాగా హీటెక్కిందనే ప్రచారం జరిగింది. దాడి వెర్సస్ పీలాగోవింద్‌గా మారిపోవడమే అందుకు కారణం. తన ముందే…పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడంపై అధినేత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మీరు మార కపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని గట్టిగానే క్లాస్ పీకారట సీఎం. ఈ క్రమంలో…..స్థానిక పరిస్థితులపై పార్టీ అధిష్టానం ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం అనకాపల్లిలో ప్రతిపక్ష నాయకత్వం బలహీనంగా వుంది. ప్రభుత్వ వైఫల్యాలను..ఎండగట్టే సమర్ధత కనిపించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రాజకీయాల కంటే అభివ్రుద్ధి మీదే ఫోకస్ పెట్టారు. అదే సమయంలో టీడీపీకి కావా ల్సినంత స్కోప్ వుంది. సంస్ధాగతంగా బలోపేతం కా వడం ద్వారా మరింత పటిష్టంగా నాయకత్వం రూపు దిద్దుకోవచ్చు. కానీ, అంతర్గత విభేజాలతో మాజీ మంత్రి వెర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహారం మారిపోవడం స్థానిక టీడీపీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. వియ్యంకుల వ్యూహాలను దాడి ఎంత వరకు ఎదుర్కోని నిలదొక్కుకుంటారన్నది చూడాలి.