Konathala Ramakrishna: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఉన్న సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇటీవల కొణతాల పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై కొణతాల రామకృష్ణ కాస్త స్పష్టతను ఇచ్చారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి భేటీ
ఈనెల 21న రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తానని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. నాయకులు, శ్రేయోభిలాషుల నుంచి చాలా కాలంగా ఒత్తిడి ఉందని.. వారి సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశానని ఆయన వెల్లడించారు. పవన్‌తో జరిగిన భేటీలో ఆంధ్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా అనేక విషయాలు చర్చకు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.ఏ పార్టీలో జాయిన్ అవుతానో డిసైడ్ చేసుకున్న తరువాత ఎమ్మెల్యే, ఎంపీ పోటీపై మాట్లాడతాననని కొణతాల రామకృష్ణ తెలిపారు. ఇదిలా ఉంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలన్న తలంపులో కొణతాల రామకృష్ణ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.