Dadi Veerabhadra Rao: అనకాపల్లి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. చేతులు కలిపారు చిరకాల ప్రత్యర్థులైన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్ర రావు.. ఇటీవల జనసేనలో చేరి అనకాపల్లి సీటు దక్కించుకున్నారు కొణతాల రామకృష్ణ.. ఇక, ఈ రోజు ఆయన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి కలిసారు.. ఈ సందర్భంగా.. మాజీమంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ గెలుపుకు సహకరిస్తాను అన్నారు. మా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలే గాని వ్యక్తిగత విభేదాలు లేవు.. ఈ కలయిక మా రెండు కుటుంబాల కలయికగా అభివర్ణించారు. వైసీపీలో అనకాపల్లిలో నాయకులు లేనట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎమ్మెల్యే అభ్యర్థిని అమెరికా నుండి తీసుకువచ్చాడు అని ఎద్దేవా చేశారు.. నియోజకవర్గం లేని నాయకుడు మంత్రి గుడివాడ అమర్నాథ్ అని సెటైర్లు వేశారు. 15 నియోజవర్గాలు గెలిపించే బాధ్యత అప్ప చెప్పిన మంత్రి గుడివాడకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు.
Read Also: VIjaya Sai Reddy: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు.. విజయసాయిరెడ్డి సెటైర్లు
మరోవైపు.. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుండె లేదని విమర్శించారు దాడి వీరభద్రరావు.. గతంలో నా కుమారుడు దాడి రత్నాకర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు, ఇప్పుడు మంత్రి అమర్నాథ్ ను కూడా అలాగే అన్నాడు అంటూ ఎద్దేవా చేశారు దాడి వీరభద్రరావు.. ఇక, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం అన్నారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. అనకాపల్లిలో తన గెలుపు కోసం సహకరించమని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావుని కలిసా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు కలిసి పని చేస్తాం అని ప్రకటించారు కొణతాల రామకృష్ణ.