Kolkata doctor case: వైద్య బృందంతో కేంద్రం చర్చలు.. భద్రతపై కమిటీ ఏర్పాటుకు హామీ
- వైద్య బృందంతో కేంద్రం చర్చలు
- భద్రతపై కమిటీ ఏర్పాటుకు హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అయ్యాయి. అంతేకాకుండా డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు మలేరియా, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ విజృంభిస్తోంది. దీంతో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వైద్య సేవలు 24 గంటలు బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రం స్పందించింది. తక్షణమే సమ్మె విరమించాలని కోరింది. వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశంలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: The GOAT Trailer : విజయ్ ‘గోట్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
కోల్‌కతా ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా భారత వైద్య సంఘం శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం 6 గంటల వరకు వైద్య సేవలు బంద్ చేసింది. ఈ క్రమంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్రం… వైద్యవృత్తిలో ఉన్నవారి భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింది.
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. ఆమె చాలా హింసకు గురైనట్లుగా అర్ధమవుతోంది. ప్రస్తుతం కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Bulldozer action: ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!