కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మొదటగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించగా.. ఇప్పుడు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య సలహాదారు పదవి నుంచి కూడా తొలగించారు. అయితే.. ఈ ఘటనలో టీఎంసీ పార్టీ నేతలే పరస్పరం తప్పు పట్టుకునే పరిస్థితి దాపరించింది. తాజాగా ఆ పార్టీ నేత సుఖేందు శేఖర్ రాయ్ ఈ కేసు విచారణలో సీబీఐ నిక్కచ్చిగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
READ MORE: Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి సీబీఐ “సైకలాజికల్ టెస్ట్‌లు” ..
కళాశాల మాజీ ప్రిన్సిపల్, పోలీస్ కమిషనర్‌ను కస్టోడియల్ విచారించాలని కోరారు. అత్యాచారం ఘటనను ఆత్మహత్యగా ఎందుకు మార్చాలనుకున్నారో తెలియాలన్నారు. అసలు సెమినార్ హాల్ కి సంబంధించిన గోడను ఎందుకు నేలమట్టం చేశారని ప్రశ్నించారు. నిందితుడు అంత శక్తిమవంతంగా మారేందుకు కారణమెవరని మండిపడ్డారు. పోలీసు జాగిలాలను రప్పించేందుకు మూడు రోజుల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు.
READ MORE:Crime News: దారుణం.. భార్యను హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసిన భర్త
ఈ మేరకు సుఖేందు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పోస్ట్ చేయగా.. దానిపై సొంత పార్టీకి చెందిన మరో నేత కునాల్ ఘోష్ స్పందించారు. సుఖేందు శేఖర్ రాయ్ పోస్టును రీపోస్టూ చేస్తూ.. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీ శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. సీపీపై వస్తున్న డిమాండ్లను వ్యతిరేకిస్తున్నానన్నారు. దర్యాప్తు సానుకూల కోణంలో సాగుతోందని పేర్కొన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకుడి నుంచి ఇలాంటి పోస్ట్ రావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. జాగిలాల విషయంలో పార్టీ నేత సుఖేందు శేఖర్ రాయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంతో ఆయనకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసుపై మాట్లాడిన భాజపా నేత లాకెట్ ఛటర్జీ, వైద్యులు కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామికి కూడా పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.