Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి సీబీఐ “సైకలాజికల్ టెస్ట్‌లు” ..
- కోల్‌కతా వైద్యురాలి హత్యాచార నిందితుడి విచారణ..
- ‘‘సైకలాజికల్ టెస్ట్’’ని నిర్వహిస్తున్న సీబీఐ..
- నిందితుడు సంజయ్ రాయ్ మానసిక పరిస్థితి విశ్లేషణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత వారం అత్యాచారం హత్యకి గురైన 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ ఘటన దేశంలో ఆగ్రహావేశాలకు కారణమైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను అత్యంతదారుణంగా రేప్ చేసి చంపారు. కాలేజీలోని సెమినార్ హాలులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఆస్పత్రిలోనే పోలీస్ సివిల్ వాలంటీర్‌గా పనిచేస్తున్నారడు. ఇతను ఘటన జరిగి రోజు హాస్పిటల్‌లోని పోలీస్ అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు వెళ్లేందుకు యాక్సెస్ ఉంది.
ఈ ఘటనలో డాక్టర్ రాత్రి విధులను ముగించుకుని ఎప్పటి లాగే సెమినార్ హాలులో నిద్రపోయింది. అయితే, తెల్లవారు శుక్రవారం ఆమె అదే ప్రదేశంలో విగతజీవిగా, నగ్నంగా, ఒంటిపై తీవ్రగాయాలతో పడిఉంది. ఘటనాస్థలంలో నిందితుడికి సంబంధించిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ లభించింది. దీంతో సంజయ్ రాయ్ నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
Read Also: Bengaluru: పార్టీ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థిని.. లిఫ్ట్ ఇచ్చి రేప్ చేసిన బైకర్..
ఈ కేసుని ఇప్పటికే కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఇదిలా ఉంటే నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు అనుమతితతో బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్, నార్కో అనాలిస్ వంటి పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధమైంది. మరోవైపు ఇతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు సీబీఐ ‘‘ సైకలాజికల్ టెస్టు’’ని నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు కోర్టు అనుమతి అవసరం లేదు. ఈ పరీక్ష నిర్వహించేందుకు నిన్న కోల్‌కతాకు ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ వైద్యుల బృందం చేరుకుంది. ముందుగా వీరు సంజయ్ రాయ్‌ని ప్రశ్నించనున్నారు. మరోవైపు బాధితురాలి మృతదేహం లభించిన సెమినార్ హాలు నుంచి ఆధారాలు సేకరించడానికి సీబీఐ ఫోరెన్సిక్ టీం మూడో రోజు కూడా ఆర్జీకర్ ఆస్పత్రిలోనే ఉంది.
సైకలాజికల్ టెస్టులో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్‌లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో, దర్యాప్తు సంస్థ బృందం రాయ్ వాయిస్‌ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు, అంటే లై-డిటెక్టర్ పరికరం, దాని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!