Union Cabinet: ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని కాబోయే నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులు..
జూన్ 9న వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో పదవుల కోసం రాష్ట్ర బీజేపీలో తీవ్ర లాబీయింగ్ మొదలైనట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎనిమిది లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది మరియు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి చాలా మంది ఎంపీలు లాబీయింగ్ ప్రారంభించినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలకు ప్రధాని మోడీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఎంపీకి కేబినెట్ హోదాలో,…
బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని.. అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారు.
జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యలో పడ్డట్టయిందని ఆయన అన్నారు. నిజాం రాజ్యం లాగా బిఆర్ఎస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని, వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కిందన్నారు…
సీఎంకు రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది.. కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నారు.
Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులను మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.
‘‘మనీష్ సిసోడియా అక్కడ ఉండుంటే..’’ స్వాతిమలివాల్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరగడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తను చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, తన కడుపులో, ఛాతిపై తన్నాడని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎన్నికల ముందు ఆప్కి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. మొత్తం వ్యవహారమంతా బీజేపీ…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ యువమోర్చ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి డబల్ డిజిట్ వస్తుందని, కాంగ్రెస్,బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బిజెపికే ఓటు వేశారన్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక…
నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్చ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా ఒక్కసారిగా కప్పు…
మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని మోడీ నిలిపారన్నారు. 400 సీట్లు NDA కు వచ్చే వాతావరణం ఉందని, మంచి మెజార్టీతో ఎంపీగా ఆరూరి రమేష్ గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని కిషన్ రెడ్డి అన్నారు. హమీలు నెరవేర్చలేని…