Singareni Coal Mines: బొగ్గుగనుల వేలం… హాజరుకానున్న మంత్రులు భట్టి, కిషన్ రెడ్డి
- నేడు తెలంగాణ బొగ్గు గనుల వేలం ప్రారంభం..
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదిక..
- హైదరాబాద్‌లో 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు మైనింగ్ వేలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Coal Mines: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నేడు తెలంగాణ బొగ్గు గనుల వేలం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు మైనింగ్ వేలాన్ని జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి సతీష్ చంద్ర దూబే, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా తదితరులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర బొగ్గు గనుల శాఖ భట్టి విక్రమార్క కు ఆహ్వానం పంపింది. ఇవాళ జరిగే బొగ్గు గనుల వేలంలో పాల్గొంటారని.. రాష్ట్ర ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరును ఇన్విటేషన్ లో నేషనల్ కోల్ మైన్స్ పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలంలో సింగరేణికే బ్లాకులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నవిషయం తెలిసిందే..
Read also: Nagababu: నేను ఇదే మొదటిసారి అసెంబ్లీ చూడటం..
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బొగ్గు గనుల ప్రైవేట్ రంగంపై బీజేపీ బిల్లు పెడితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటు వేసి మద్దతిచ్చిందని అన్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన బీఆర్‌ఎస్.. నేడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఖమ్మంలో జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బావుల వేలంలో పాల్గొనకుండా సింగరేణి సంస్థను నష్టపోయేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు. వేలంలో బొగ్గు బావులు ఇతర పార్టీకి వెళ్లకుండా అడ్డుకోలేకపోయిన బి.ఆర్.ఎస్. గోదావరి లోయలోని బొగ్గు గనులను తీసుకోకూడదని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నాయి. బీఆర్‌ఎస్ వల్లే ప్రభుత్వానికి రెండు బొగ్గు గనులు రాలేదని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. తెలంగాణ ఆస్తులు కాపాడాలన్నారు. ఇక తెలంగాణను పదేళ్లు నాశనం చేసిన బీఆర్‌ఎస్ ఇంకా అలానే వ్యవహరించాలని చూస్తుందని తెలిపారు…సింగరేణి వేలంపై కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.
ED: కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ..హైకోర్టును చేసి ఈడీ..కొద్ది సేపట్లో విచారణ
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?