Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లు ముట్టడికి విద్యార్థి సంఘాలు..
- నీట్ రద్దు చేయాలంటూ డిమాండ్..
- న్యాయం చేయకుంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్..
- విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు కాచిగూడలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ విద్యార్థి సంఘాల నాయకులు ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్రంలోని నీట్ విద్యార్థులకు న్యాయం చేయకుంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్సీ వెంకట్‌తోపాటు విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. SFI, PDSU, NSUI, AISF విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నీట్ అంశంపై కేంద్రమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరామని, ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. కొద్ది రోజులుగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Today Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! అస్సలు ఊహించరు
Also Read
నీట్ అంశంపై కేంద్రమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరామని, ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. కొద్ది రోజులుగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ వ్యవహారంపై తెలిపేందుకు కిషన్ రెడ్డి ఆపాయింట్ మెంట్ కోరినా అధికారుల్లో స్పందన లేదని మండిపడ్డారు. దీంతో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించామని తెలిపారు. ఇప్పటి కైనా కేంద్ర మంత్రి స్పందిచకపోతే ఉద్రికత్త చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడక పోవడం విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు నీట్ రద్దు కై ఓయూలో టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ దీక్ష చేపట్టారు. సీబీఐతో విచారణ జరపాలని, నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. NTA డైరెక్టర్ ను అరెస్ట్ చేయాలని కోరారు. ఓయూ మెయిన్ లైబ్రరీ ముందు చనగాని దీక్ష లో కూర్చున్నారు. NSUI ఓయూ అధ్యక్షులు మెడ శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు దీక్షకు సంఘీభావం వ్యక్తం చేశారు.
Hyderabad No-1: పొదుపులో నెం.1గా భాగ్యనగర వాసులు.. ది గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వే
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?