Kishan Reddy-Bandi Sanjay: తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్ కు పీఎంవో నుంచి సమాచారం అందింది. ఇవాళ సాయంత్రం మోడీతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. గతంలోనూ ఇదే స్థానంలో గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
Read also: Rammohan Naidu : 26 ఏళ్ల వయసులో ఎంపీ.. ఇప్పుడు మంత్రి.. రామ్మోహన్ నాయుడు స్పెషాలిటీ ఇదే!
కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..
కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా. 1977లో జనతా పార్టీలో చేరారు. అంతకుముందు సంఘ్ కార్యకర్త. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి తొలిసారి హిమాయత్ నగర్ శాసనసభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో సీటు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో అంబర్ పేట నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2014లో మరో అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2016 నుంచి 2018 వరకు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇందులో గెలవడమే కాకుండా కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కింది. ఇటీవలి వరకు, అతను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
Read also: Ramoji Rao: రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు
బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం..
బండి సంజయ్ విషయానికొస్తే… 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ విజయం సాధించారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన సంజయ్ 2024 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి గెలుపొందారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటింది. కేంద్ర కేబినెట్ లో బండి సంజయ్ కి చోటు దక్కడంతో కుటుంబ సభ్యుల సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కోసం బండి సంజయ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉందని బండి సంజయ్ తల్లి శకుంతల పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో చాలా తక్కువగా గడిపేవారని తెలిపారు. ప్రజా సమస్యల పై ఎన్నో సార్లు జైల్ కు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. కాగా.. 17 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో 4 చోట్ల ఉండగా… ఈసారి మరో నాలుగు చోట్ల అడుగు పెట్టింది.
Rammohan Naidu : 26 ఏళ్ల వయసులో ఎంపీ.. ఇప్పుడు మంత్రి.. రామ్మోహన్ నాయుడు స్పెషాలిటీ ఇదే!