Telangana Union Cabinet: నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్
- పదవీ బాధ్యతలు చేపట్టనున్న కేంద్ర మంత్రులు
- ఉదయం 10.35కు హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్
- ఉదయం 11.00కు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
- తెలంగాణ భవన్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి. ఇవాళ ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్ లో హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఉదయం గం. 11 గంటలకు శాస్త్రి భవన్ లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఛార్జ్ తీసుకోవడానికి ముందు తెలంగాణ భవన్ లో అమరవీరుల స్తూపం వద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలు గురువారం లేదా శుక్రవారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రులుగా పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
Read also: Pushpa 2: బన్నీ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్.. ఊహించని కారణంతో సినిమా వాయిదా?
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..
కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా. 1977లో జనతా పార్టీలో చేరారు. అంతకుముందు సంఘ్ కార్యకర్త. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి తొలిసారి హిమాయత్ నగర్ శాసనసభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో సీటు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో అంబర్ పేట నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Read also: IND vs USA: అమెరికాపై చెమటోడ్చి నెగ్గిన భారత్.. సూపర్-8కు రోహిత్ సేన!
2014లో మరో అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2016 నుంచి 2018 వరకు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇందులో గెలవడమే కాకుండా కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కింది. ఇటీవలి వరకు, అతను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
Read also: Borugadda Anil: పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. బోరుగడ్డ ఆఫీస్ దగ్ధం!
బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం..
బండి సంజయ్ విషయానికొస్తే… 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ విజయం సాధించారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన సంజయ్ 2024 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి గెలుపొందారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటింది.
Read also: Astrology: జూన్ 13, గురువారం దినఫలాలు
కేంద్ర కేబినెట్ లో బండి సంజయ్ కి చోటు దక్కడంతో కుటుంబ సభ్యుల సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కోసం బండి సంజయ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉందని బండి సంజయ్ తల్లి శకుంతల పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో చాలా తక్కువగా గడిపేవారని తెలిపారు. ప్రజా సమస్యల పై ఎన్నో సార్లు జైల్ కు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. కాగా.. 17 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో 4 చోట్ల ఉండగా… ఈసారి మరో నాలుగు చోట్ల అడుగు పెట్టింది.
Bengaluru: కోర్టు ఆవరణలో పాక్ నినాదాలు.. గ్యాంగ్‌స్టార్‌కు దేహశుద్ధి
తాజావార్తలు
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?