G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.? అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈనెల పదవ తేదీన మోడీ హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు.
మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమైన నాయకుడు.. సెలవు ఉంది కదా అని ఓటెయ్యకుండా ఉండకండి.. ఓటేసి సెలవు తీసుకోండి అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో మంత్రిగా దానం, ఎంపీగా అంజన్ కుమార్ జంట నగరాలను అభివృద్ధి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యాంగం రద్దు చేస్తున్నారని.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేక ఉండే బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు లేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. తాము మండల కమిషన్ అమలు…
ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్‌తోనే ఉన్నా పద్మారావు గౌడ్‌కు 60 వేల మెజార్టీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పద్మారావు గౌడ్ కేసీఆర్‌కు తమ్ముడి లాంటి వారని ఆయన అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్లలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ హామీలు అని ఆయన విమర్శించారు. సర్పంచ్‌లకు నేరుగా నిధులు ఆల్రెడీ వస్తున్నాయని, పీఎం సూర్య ఘర్ సోలార్ విద్యుత్ యోజన.. ఇప్పటికే కేంద్రం ప్రారంభించిందన్నారు కిషన్ రెడ్డి. సంగీత నాటక అకాడమీ కి ఫౌండేషన్ , ఘంటశాల కళమండపం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది.. శంఖుస్థాపన…
అంబేడ్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామానికి రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబేడ్కర్ పంచ తీర్థ స్థలాలను అభివృద్ధి చేశామని, పార్లమెంట్ లో తొలిసారి అంబేడ్కర్ ఫోటో పెట్టింది అటల్ జీ.. బీజేపీ అని ఆయన అన్నారు. ఇక్కడ కూడా అంబేడ్కర్ ఫోటో పెట్టాలని ధర్నాలు చేసి.. లాఠీలతో కొట్టించారని, సబ్ కా సాథ్.. సబ్…