TDP Worker Killed: అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను దారుణ హత్య చేశారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షిణారహితంగా పొడిచి చంపి.. మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు.
ఇండియా టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా గెలుపు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని.. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు.
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్…
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్‌లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలులోని గార్డు మరణించారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నోట్లో కాగితాలు కుక్కి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన థానే జిల్లా సహపూర్ తాలూకా పరిధిలోని కసర ప్రాంతంలోని వశాల వద్ద సోమవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. ఘటన జరిగిన సమయంలో 59 ఏళ్ల నిందితుడు మద్యం…
మెక్సికోలోని హిడాల్గోలోని ఫేమస్ అయిన ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు వస్తున్న సమయంలో దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేసిన ఓ యువతిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అల్మాస్‌గూడలోని వినాయక హిల్స్ లో కూతురు నిహారిక అత్తను తండ్రి చంపేశాడు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ లష్కరే తోయిబాకు చెందిన.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు, వారు రహస్య ప్రదేశంలో ఓ ఇంటిలో తలదాచుకున్నట్లు సమాచారం అందిందని భద్రతా అధికారులు తెలిపారు.
కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్గామ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న టూరిస్ట్ వాహనం ఒక్కసారిగా లోయలో జారి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పంజాబ్ వాసులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రేమించే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత.. అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందుకే ప్రేమించే ముందే.. భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రేమించాలి. అయితే తాజాగా.. ప్రేమించిన ప్రియుడిని కాదనుకునేందుకు హత్య చేసింది ప్రియురాలు. ఈ ఘటన హర్యానాలోని తిక్రీ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది.