జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ లష్కరే తోయిబాకు చెందిన.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు, వారు రహస్య ప్రదేశంలో ఓ ఇంటిలో తలదాచుకున్నట్లు సమాచారం అందిందని భద్రతా అధికారులు తెలిపారు.
Read Also: Actress Hema : డ్రగ్స్ కేసులో ట్విస్టు.. పోలీసుల అదుపులో హేమ?
ఈ క్రమంలో.. సోమవారం ఉదయం పుల్వామా జిల్లాలోని నెహమా ప్రాంతంలో ఉగ్రవాద స్థావరం ఏర్పరచుకున్నట్లు తెలుసుకుని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. అనంతరం.. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మే 7న కుల్గామ్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో లష్కరే మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) క్రియాశీల సభ్యుడు బాసిత్ దార్ కూడా ఉన్నాడు.
Read Also: Ex-BrahMos engineer: ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేసినందుకు బ్రహ్మోస్ మాజీ ఇంజనీర్‌కు జీవిత ఖైదు..