ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో క్రిమినల్ రషీద్ కాలియాను హతమార్చారు. ఓ కాంట్రాక్టర్ ను చంపేందుకు వచ్చిన సమయంలో యూపీ ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేశారు. ఘటనా స్థలంలో అతని వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలైన రషీద్ కాలియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను వేధించాడని స్నేహితుడిని అతి దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు. మృతుడి మొబైల్ ద్వారా వివరాలు సేకరిస్తారని దానిని బావిలో పడేశాడు. మృతుడు సైన్యంలో పనిచేసి రిటైరయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Hyderabad: కుటుంబ కలహాలు జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అన్యోన్యంగా ఉండే జీవితాల్లో చిన్న చిన్న గొడవలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని ప్రభావం పిల్లలపై పడుతుందనే ఆలోచన లేకుండా పోతుంది.
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత ఎంకే అళగిరి సహాయకుడిపై బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. ఈ దాడి ఘటన సెప్టెంబర్ 5న జరిగింది. దాడి చేసిన అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడు. మృతుడు వీకే గురుస్వామి మూర్తిగా(64) గుర్తించారు.
కృష్ణా జిల్లా అయ్యంకిలో మరోసారి ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో భార్యాభర్తలను దారుణంగా హత్య చేశారు. పాత కక్షలు నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి అనే మహిళను నడిరోడ్డుపైన చంపేశారు. ఈమె భర్త వీరంకి వీర కృష్ణను పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణంగా హత్య చేశారు.
షాద్ నగర్ లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నారని కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ కుమార్ హత్య చేశాడు. బీహార్ కు చెందిన చంద్రకుమార్ అనే సినిమాను అదే స్టైల్ లో కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ హతమార్చాడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 15న వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్ లో ఎల్లమ్మ గుడి దగ్గర వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు.
కేరళలోని తిరువనంతపురం జిల్లా కట్టకడలో 15 ఏళ్ల ఆదిశేఖర్ అనే బాలుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే ఆగస్టు 30వ తారీఖున ఆ బాలుడు తన స్నేహితులతో ఆడుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూవాచల్లోని లింకోడ్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఎలక్ట్రిక్ కారు అతడిని ఒక్క సారిగా ఢీకొట్టింది.