Road Accident : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్స్‌లోని మెరాఫాంగ్ స్థానిక మునిసిపాలిటీలో బుధవారం ఉదయం మినీబస్సు, ట్రక్కు ఢీకొనడంతో 12 మంది విద్యార్థులతో సహా 13 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. ప్రావిన్స్‌లోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మాటోమ్ చిలోన్ మాట్లాడుతూ.. ఉదయం 06:45 గంటలకు విద్యార్థులను తీసుకెళ్తున్న మినీబస్సును పికప్ ట్రక్ వెనుక నుండి ఢీకొట్టింది.. దీంతో అది బోల్తాపడింది.
Read Also:Viral Video: శుభ్‌మాన్ గిల్ సోదరితో రింకూ సింగ్.. వీడియో వైరల్!
బస్సులో ఉన్న 11 మంది విద్యార్థులు రాక్‌ల్యాండ్స్ ప్రైమరీ స్కూల్‌కు చెందినవారని, ఒకరు కార్ల్‌టన్‌విల్లేలోని లార్‌స్కూల్ బ్లీవోరూట్‌సిగ్‌కు చెందినవారని మిస్టర్ చిలోనే చెప్పారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఈ సంఘటన పట్ల నేను చాలా బాధపడ్డాను అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మా పిల్లలను కోల్పోవడం మా సమాజానికి ఒక గొప్ప విషాదం, మా ఆలోచనలు, ప్రార్థనలు మరణించిన వారికి సంతాపం తెలుపుతున్నామని చెప్పారు. గాయపడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. దుర్ఘటనను ఎదుర్కొనేందుకు విద్యార్థులందరికీ, సిబ్బందికి కౌన్సెలింగ్ సేవలు అందిస్తామని మిస్టర్ చిలోనే చెప్పారు.