Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ శైలి, జట్టు అవసరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే, ఐర్లాండ్ పర్యటనల్లో ప్రారంభంలోనే వికెట్లు పడిపోవడంతో మైదానంలోకి అడుగుపెట్టగానే దూకుడుగా ఆడటం సరికాదని, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశారు. జింబాబ్వేతో తొలి టీ20కి ముందు మాట్లాడిన ఆయన, జట్టు ప్రయోజనాల కోసమే కొన్నిసార్లు ఓపికగా ఆడాల్సి వస్తుందని తెలిపారు.
తొలి ఓవర్లలోనే 4, 5 వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వెళ్లి తొలి బంతి నుంచే షాట్లు ఆడి అవుట్ కావడం బాధ్యతారాహిత్యం అవుతుందని.. అలా నేను బ్యాటింగ్ చేయలేను అని తిలక్ వర్మ అన్నారు. దేశానికి ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా వైస్ కెప్టెన్సీ బాధ్యత ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఆశించే వ్యూహాలకు లోబడి ఆడటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఆసియా ఖండంలోనే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడటం వల్ల యూకే పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోయామని, అందుకే అక్కడ ఓటములు ఎదురయ్యాయని వివరించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇంగ్లాండ్ బలమైన జట్టు అని, తమ ప్రదర్శన నుంచి నేర్చుకున్న పాఠాలు ముందుముందు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే జింబాబ్వే సిరీస్‌పై స్పందిస్తూ, జింబాబ్వేను తక్కువగా అంచనా వేయలేమని, వారు సవాలు విసిరే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పర్యటన అనుభవాలు, ఐర్లాండ్-ఇంగ్లాండ్ సిరీస్‌ల నుంచి నేర్చుకున్న విషయాలు ఈ సిరీస్‌లో జట్టుకు కలసివస్తాయని తిలక్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?