ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్న మాధవరావు పాలిట కాలయముడయ్యాడు తమ్ముడు సాంబశివరావు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి గ్రామంలో మాధవరావుని గడ్డపారతో కొట్టి చంపాడు తమ్ముడు సాంబశివరావు.. అన్నదమ్ములిద్దరు ఘర్షన పడ్డారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన తమ్ముడు అన్నను గడ్డపారతో కొట్టి చంపాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఆస్తి తగాదాలే అని స్థానికులు చెబుతున్నారు. Also Read:Dussehra Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు, భక్తుల సందడి, భారీ బందోబస్త్…
వరంగల్ జిల్లా బాలాజీ నగర్లో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందనే అనుమానంతో రితీశ్ సింగ్ తన భార్య రేష్మాను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలానగర్‌కు చెందిన రేష్మాను యూపీకి చెందిన రితీశ్ సింగ్ ప్రేమవివాహం చేసుకున్నాడు. కాగా కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు రితీష్ సింగ్. భర్త రితేశ్ రేష్మాను హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న…
ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హత్య చేశాక ఏమీ తెలియని అమాయకురాలిగా.. తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసుల విచారణలో భార్య బాగోతం బయటపడింది. భార్య లక్ష్మీ(40) 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
గుంటూరులో నివాసం ఉండే షేక్ మల్లిక సొంతూరు పెదకాకాని మండలం నంబూరు గ్రామం. పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అక్బర్‌కు తెలియడంతో అతనితో విడాకులు తీసుకొని పిల్లలను వదిలేసి ప్రేమ్ కుమార్‌తో గుంటూరు వచ్చేసింది. ప్రేమ్ కుమార్‌ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్‌గా గుర్తించారు.
యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో పగులగొట్టి హత్య చేసింది. అనంతరం.. భర్త మృతదేహంపై ఇటుకలను పడేశారు. ఉదయం తన తల్లి ఇంటికి వెళ్లిన భార్య రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పింది. మృతదేహంపై తల తప్ప మరెక్కడా గాయాలు లేకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు.
జార్ఖండ్‌లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డబ్బు కోసం తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారు. విషయం ఠాకూర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటు గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ ఓ యువకుడిని అతని తండ్రి, సవతి తల్లి కలిసి చంపేశారు.
సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) ఖానాపూర్(బీ) గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు మనవడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, మెడలోని బంగారు గుండ్ల కోసం అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవపడ్డాడు మనవడు మహేష్(26).
Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.