OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి వైసీపీ అటెండ్ అయ్యే అవకాశం ఉందా? డీఎస్సీ ఎపిసోడ్ హాట్‌హాట్‌గా నడుస్తున్నందున నిర్ణయం మారే అవకాశం ఉంటుందా? కూటమి సభ్యులందరికీ అధికార పక్షం అలర్ట్ వార్నింగ్ ఇవ్వడం వెనకున్న ఉద్దేశ్యే ఏంటి? వైసీపీ వచ్చినా, రాకున్నా అంటూ చర్చలు ఎందుకు మొదలయ్యాయి? బీసీల విషయంలో ఈసారి తీసుకోబోతున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నాలుగు రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. సాధారణంగా అసెంబ్లీ సెషన్ అనగానే… ఏం జరుగుతోంది? ఏయే అంశాల ప్రస్తావన వస్తుంది? కీలకమైన ప్రకటనలు ఏవైనా ఉంటాయా అంటూ… ప్రజల ఫోకస్ ఇటువైపు మళ్ళుతుంది. వివిధ సమస్యల మీద ప్రభుత్వం ఏం చెబుతోందన్న అనేక విషయాలతో పాటు సభలో జరిగే చర్చను సీరియస్‌గా గమనిస్తూనే ఉంటారు. అయితే… ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక అధికార పక్షం తప్ప ప్రతిపక్షం సభలో లేకుండా పోయింది. అసెంబ్లీకి వెళ్ళకూడదన్న వైసీపీ నిర్ణయంతో గడిచిన రెండేళ్లుగా వార్ వన్‌సైడే అన్నట్టు నడుస్తోంది వ్యవహారం. అదంతా ఒక ఎత్తయితే… క్రమంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. సభకు వెళ్ళకున్నా…వివిధ అంశాల మీద ప్రభుత్వాన్ని వివిధ ఆందోళన రూపంలో నిలదీస్తోంది వైసీపీ. మరీ ముఖ్యంగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో హోరెత్తిస్తోంది విపక్షం. దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో డీఎస్సీ విషయంలో ప్రభుత్వం కూడా క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇక తాము చెప్పాలనుకున్నదేదో అందరికీ తెలిసేలా, సభాముఖంగానే చెప్పాలనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. దాంతోపాటు గత రెండేళ్ళలో ఏం చేశాం…రాబోయే మూడేళ్ళలో ఏం చేస్తామన్న విషయాన్ని క్లియర్‌గా, సూటిగా… సుత్తిలేకుండా చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
అలాగే… ఈసారి ఆరు కీలకమైన అంశాలకు సంబంధించి డిటైల్డ్ డిస్కషన్ చేయబోతున్నట్టు సమాచారం. వీటిలో అత్యంత కీలకమైనది బీసీ రిజర్వేషన్ బిల్లు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన బిల్లును ఈ సెషన్లోనే ప్రవేశపెట్టబోతున్నారట. దీనిని హై ప్రయారిటీగా చెబుతున్నాయి కూటమి వర్గాలు. అందుకే తమ సభ్యులు ఎవ్వరూ డుమ్మా కొట్టకుండా చర్చలో భాగస్వాములు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచే క్రమంలో ఈ బిల్లు అత్యంత కీలకమైనదని, ఎంతో కసరత్తు తర్వాత బిల్లు ప్రవేశ పెడుతున్నందున సభ్యులంతా అలర్ట్‌గా ఉండి, చర్చలో పాల్గొనాలని సూచిస్తున్నారట కూటమి పెద్దలు. ఇలాంటి సందర్భంలో వైసీపీ కూడా సభకు వస్తే మంచిదని, వాళ్ళు వచ్చినా, రాకున్నా… సంబంధం లేదు, మనం మాత్రం బాధ్యతాయుతంగా చర్చలో పాల్గొనాలని టీడీపీ సభ్యులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలిసింది.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ప్రతిపక్షం సభలో లేకున్నా… ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలు.. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, శాంతి భద్రతలు.. ఇలా అన్ని అంశాలను టచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ అనూహ్యంగా వైసీపీ సభకు హాజరై..కొన్ని అంశాలను ప్రస్తావించినా…. దీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాలన్న ఆదేశాలు కూటమి నేతలకు వెళ్ళాయట. వైసీపీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ వ్యతిరేక ఆందోళనలు నిర్వహిస్తున్నందున అసెంబ్లీలో ఈ అంశాన్ని తప్పకుండా ప్రస్తావించి క్లారిటీ ఇవ్వాలనుకుంటోందట అధికార పక్షం. అటు శాసన మండలికి వైసీపీ అటెండ్ అవుతున్నందున అక్కడ కచ్చితంగా డీఎస్సీ రచ్చ ఉంటుందన్న ఉద్దేశ్యంతో కూటమి ఎమ్మెల్సీలను అలర్ట్ చేశారన్నది ఇంటర్నల్ టాక్. మొత్తం మీద అసెంబ్లీకి ప్రతిపక్షం అటెండ్ అయినా, కాకున్నా… అలర్ట్‌గా ఉండేందుకు కూటమి రెడీ అవుతున్నట్టు సమాచారం.
- Tags
- OTR
- tdp vs ycp
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!