Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర్ల సహాయంతో దొర్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హేమలత భర్త మాధవరెడ్డి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తన పొలం విషయంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి పంచాయతీ చేయగా.. అప్పటినుంచి వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.. పెళ్లి చేసుకోవాలనే కొంతకాలం ఇద్దరు బాగా కలిసి ఉన్నారు. అయితే, ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. హేమలత తనతో మాట్లాడడం లేదని ఆగ్రహం చెందిన నరసింహారెడ్డి భూమా అఖిలప్రియ అనుచరులతో కలిసి హేమలతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా.. ఆమె కుటుంబీకులు, స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు హేమలత ఇంటిముందు వీరంగం సృష్టించారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. బాధితులు దొర్నిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నరసింహారెడ్డితో పాటు నిఖిల్, సంపత్, మరో 7 మందిపై కేసు నమోదు చేశారు.
Read Also: Andhra Pradesh: పర్యావరణ దినోత్సవం.. రాజధాని ప్రాంతంలో మొక్కలు నాటనున్న సీఎం, డిప్యూటీ సీఎం..