Adibatla : వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం.. లేడీ వాయిస్‌తో ట్రాప్..!
- ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం
- లేడీ వాయిస్‌తో ట్రాప్ చేయించి కిడ్నాప్‌కు పాల్పడ్డ దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adibatla : ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి ఆగంతకులు కోటి రూపాయలను డిమాండ్ చేశారు. లేడీ వాయిస్‌తో ట్రాప్ చేయించి దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. తుపాకీని తలపై పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి నారాయణను పోలీసులు కాపాడారు. నారాయణను కిడ్నాప్ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎంబీబీఎస్ డాక్టర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు అరెస్ట్ అయ్యారు.
Read Also: Minister Konda Surekha: ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం!
Also Read
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
సినీ ఫక్కీలో కిడ్నాప్ ప్లాన్ చేసిన దుండగులు అరెస్టు అయినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. ఈ నెల 23న బట్టల వ్యాపారి రచ్చ నారాయణ కిడ్నాప్ అయినట్లు వెల్లడించారు. కిడ్నాప్‌కు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు ఎంబీబీఎస్ డాక్టర్ , స్పోర్ట్స్ మెన్‌గా ఉన్న కొరివి ధనరాజ్ అరెస్ట్ అయినట్లు డీసీపీ చెప్పారు. ఈజీ మనీకి అలవాటు పడి నిందితులు నేరానికి పాల్పడినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో పోలీసు యూనిఫాం, పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. నిందితుల నుంచి ఓ పిస్టల్, పోలీసు యూనిఫాం, రెండూ కత్తులు, మూడు కోట్ల విలువ గల భూ ల్యాండ్ పత్రాలు , ఏడు సెల్ ఫోన్స్, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బట్టల వ్యాపారిని కిడ్నాప్ చేసి భయబ్రాంతులకు గురి చేసి భూమి పేపర్లపై ప్రధాన నిందితుడు ధనరాజ్ సంతకాలు పెట్టించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!