Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- 7.4 తీవ్రతతో భారీ ప్రకంపనలు.. కూలిన భవనాలు
- శిథిలాల కింద చిక్కుకున్న పలువురు.. వీధుల్లోకి జనం
- చారిత్రాత్మక చర్చి టవర్ ధ్వంసం.. 6 ఎయిర్‌పోర్టులు మూసివేత
- రంగంలోకి కొలంబియా ప్రభుత్వం.. సహాయక చర్యలు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీరని విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోయారని అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదించింది. భూకంప ప్రకంపనల తీవ్రతకు పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోగా, వేలాది మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు.
శాన్ జోస్ డెల్ పాల్మర్ కేంద్రంగా భూకంపం
రాజధాని బొగోటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మర్ (సుమారు 4,800 మంది జనాభా ఉన్న ప్రాంతం) వద్ద భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. భూకంపం భూమికి 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ ప్రకంపనల తీవ్రత పొరుగున ఉన్న ఈక్వెడార్ దేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. కొలంబియాలోని పెరీరా నగరంలోనే అత్యధికంగా 18 మంది మరణించారని మేయర్ మౌరిసియో సలాజర్ తెలిపారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- CE-25A Electric Aircraft: 22,000 పౌండ్ల ఎలక్ట్రిక్ విమానం.. చైనా CE-25A తొలి పైలట్ ఫ్లైట్ సక్సెస్
- Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
- US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
కూలిన చర్చి టవర్, 6 విమానాశ్రయాల్లో నిలిచిన సేవలు
భూకంప తీవ్రతకు పెరీరా, కాళీ, క్విబ్డో నగరాల్లో అనేక ఇళ్లు, చిన్న భవనాలు కూలిపోయిన దృశ్యాలు స్థానిక మీడియాలో బయటకు వచ్చాయి. మానిజాలెస్ నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక నియో-గోథిక్ కేథడ్రల్ టవర్ తీవ్రంగా దెబ్బతిని కూలిపోయింది. మరోవైపు, భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మానిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా నగరాలకు సేవలుందించే 6 విమానాశ్రయాలు దెబ్బతిన్నాయని, వాటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పౌర విమానయాన సంస్థ ఎక్స్ (X) వేదికగా వెల్లడించింది.
రంగంలోకి ప్రభుత్వం
ఈ పీడకల నుంచి తేరుకునేందుకు కొలంబియా ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలను చేపట్టింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేశ అధ్యక్షుడు అబెలార్డో దే లా ఎస్ప్రియెల్లా స్వయంగా శాన్ జోస్ డెల్ పాల్మర్లో అత్యవసర సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెప్తూ.. “మీరు ఒంటరిగా లేరు, ప్రభుత్వం మీకు అండగా ఉంది, తక్షణ చర్యలు తీసుకుంటోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. కొలంబియాలో చిన్నపాటి భూకంపాలు సాధారణమే అయినప్పటికీ, 6.0 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు చాలా అరుదని నిపుణులు చెప్తున్నారు.
OMG, this is terrifying. Footage showing the shaking from the M7.2 earthquake that hit Colombia earlier.
👀 Watch until the end.
📍 Pereirapic.twitter.com/vS2slBg53X
— Volcaholic 🌋 (@volcaholic1) August 10, 2026
తాజావార్తలు
-
Arshdeep Singh: నేను బంతికి భయపడతా అంటారు.. కానీ ఎలా ఆడనో చూశారు కదా!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
CE-25A Electric Aircraft: 22,000 పౌండ్ల ఎలక్ట్రిక్ విమానం.. చైనా CE-25A తొలి పైలట్ ఫ్లైట్ సక్సెస్
-
AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
PM Modi Manila Visit 2026: PM మోడీ మనీలా పర్యటన.. ఆసియాన్ సదస్సులో భారత్ ప్రధాన లక్ష్యాలివే
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!