OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
- కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ మధ్య గ్యాప్..
- పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల టైంలో విభేదాలు..
- ఇటీవల సీపీఐ సభల్లో విరుచుకుపడుతున్న ఎమ్మెల్యే కూనంనేని..
- మరోసారి అధికారంలోకి రావాలంటూనే విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు అధికారంలో ఉండాలని అంటారు… అంతలోనే పొట్టు పొట్టున తిట్టి పోస్తారు. మనం మనం బరంపురం… కలిసి పోరాడదాం, అవతలి వాళ్ళకు అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని అంటారు. వెంటనే బహిరంగంగా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. అంత వైవిధ్యంగా వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? మిత్రుడిగా ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో మిత్ర పక్షాల మధ్య సమన్వయం లోపించి సమస్యలు పెరుగుతున్నాయట. ముఖ్యంగా… సీపీఐ తెలంగాణ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు, ఇక్కడి కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతోందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఈ సీటు ఆశించారు. కానీ… కాంగ్రెస్ అధిష్టానం పొత్తులో భాగంగా మిత్రపక్షానికి కేటాయించడంతో హస్తం శ్రేణులు కూడా కలిసి పని చేసి కూనంనేనిని గెలిపించాయి. అదే సమయంలో మొదట్నుంచి కొత్తగూడెంలో లెఫ్ట్ పార్టీలకు పట్టు ఉండటం కలిసి వచ్చింది. అదంతా ఒక ఎత్తయితే ఇటీవల ఇక్కడి రాజకీయ సమీకరణలు మారుతున్నాయట. సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు వివాదాలు రేగుతున్నాయి.
Also Read
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
గ్రామ పంచాయతి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మంత్రి పొంగులేటి వియ్యంకుడు, ఎంపీ రఘురామి రెడ్డి అక్కడే ఉండి ప్రణాళికలు రచించారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన పలువురు అధికారులకు మంత్రి పొంగులేటి పోస్టింగ్స్ వేయించారన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇక ఆ తర్వాతి నుంచి ఎమ్మెల్యేకి, మంత్రికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందట. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరికీ పోటా పోటీగా సీట్లు రావడంతో… పంచాయితీ అధిష్టానం దగ్గరికి చేరింది. మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్ళు పంచుకోమని చెప్పడంతో వివాదం అక్కడితో సమసి పోయిందని అనుకున్నారు.
కానీ.. వారి మధ్య ఇంకా సఖ్యత రానట్టే కనిపిస్తోందని అంటున్నారు. సిపిఐ సమావేశాల్లో సాంబశివరావు కాంగ్రెస్ పై విరుచుకు పడుతూనే ఉన్నారు. తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని అంటూనే…. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని చెబుతూనే.. విమర్శల విషయంలో మాత్రం తగ్గడం లేదు. తాజాగా పినపాక నియోజకవర్గం సభలో కాంగ్రెస్ పై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు సీపీఐ ఎమ్మెల్యే. అయితే… ఆ పార్టీ అధికారంలో ఉండాలని మాత్రం కోరుకుంటున్నామని, బీజేపీ లాంటి పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జత కడుతున్నామని అన్నారాయన. ఈ క్రమంలో రాజకీయవర్గాలకు సరికొత్త డౌట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పేరుతో కూనంనేని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా…దాని వెనక అసలు కారణం మంత్రి పొంగులేటి మీద వ్యతిరేకతేనని చెప్పుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి తన అనుచర గణాన్ని పెంచుకుంటున్నారట.
అలాగే గతంలో పినపాకలో సిపిఐకి పట్టు ఉండేది. ఇప్పుడు పొంగులేటి అనుచరుడైన పినపాక ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వరరావు కూడా గతంలో సిపిఐ నుంచి గెలిచిన వ్యక్తే. అయితే అక్కడ కూడా సీపీఐకి, మంత్రికి మధ్య విభేదాలున్నాయట. ఈ రెండు నియోజకవర్గాల్లో సిపిఐకి, పొంగులేటి అనుచరులకు మధ్య వివాదాలు రావడం వల్లనే కూనంనేని అధికార పార్టీ మీద భగ్గుమంటున్నారా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఇక భద్రాద్రి జిల్లాలో కూడా మంత్రి పొంగులేటికి అనుచర వర్గం బాగా ఉంది. అక్కడి ఎమ్మెల్యేల్లో నలుగురు తన వర్గం వారే ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్స్‌లో కూనంనేని సాంబశివరావుకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య తేడా కొడుతోందని, దాన్ని బేస్ చేసుకునే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండవచ్చన్నది లోకల్ పొలిటికల్ టాక్.
తాజావార్తలు
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?