Kidnap : శ్రీ సౌమ్య.. కశింకోట అనిల్ కుమార్‌ను ప్రేమించిందా..?
- ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు?
- కశింకోట అనిల్ కుమార్‌పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి?
- శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
- అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు..
సోయం శ్రీసౌమ్యను కిడ్నాప్ చేసిన వ్యక్తిని కశింకోట అనిల్ కుమార్‌గా గుర్తించారు. గతంలో నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో ఇద్దరూ కలిసి పారిపోయిన సమయంలో అమ్మాయి మైనర్‌గా ఉండేదని.. ఇప్పుడు మేజర్ అయినట్లు వెల్లడించారు. ఐతే అదే వ్యక్తి ఇప్పుడు మళ్లీ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయినట్లు చెబుతున్నారు ఎస్పీ. పైగా కశింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తిపై డ్రగ్స్ కలిగి ఉన్నాడనే నేరంపై NDPS సెక్షన్ కింద కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో వరదనీటి సమస్యకు చెక్..!
శరభవరంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీసౌమ్యను.. గురువారం ఉదయం ఆఫీసు నుంచే కొంత మంది ఎత్తుకెళ్లారు. ఆఫీసుకు వచ్చిన దుండగులు ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. అక్కడ కొంత మంది వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐతే చివరకు ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తి కశింకోట అనిల్ కుమారే ఆమెను మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు తేలింది…
ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు… శరభవరం, మారేడుమిల్లి రవాణా మార్గాల్లోని అన్ని CCTV ఫుటేజ్‌లను పరిశీలించారు. అంతే కాదు ఇన్నోవా వాహనాన్ని గుర్తించేందుకు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. చివరకు కిడ్నాపర్లను ఒడిశాలోని చిత్రకొండలో పట్టుకున్నారు.. మొత్తానికి కిడ్నాప్ కథ ముగిసింది. కానీ శ్రీ సౌమ్య.. నిజంగానే కశింకోట అనిల్ కుమార్‌ను ప్రేమించిందా? ఒకవేళ ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు? కశింకోట అనిల్ కుమార్‌పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి? అతనికి మంచి ఉద్దేశ్యమే ఉంటే.. శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది..
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?