Nagarkurnool Childrens Kidnap News: ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లో చిన్నారులను అపహరించే ముఠాలు సంచరిస్తుండడంతో.. జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పిల్లలు అపహరణకు గురికాగా.. అందులో కొందరిని పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పోలీసుల నిఘా, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నా కూడా ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారులను అపహరించేందుకు అగంతకులు ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం…
Hyderabad Kidnapping Case: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కిడ్నాప్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని మాదన్నపేటలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది.
ఇవ్వాల్సిన డబ్బు కోసం ఇంటి మీదకు వచ్చి బెదిరిస్తారు.. తిడతారు.. కొడతారు. కానీ ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అప్పు తీర్చలేదని బాలుడిని కిడ్నాప్ చేశాడు ఆళ్లగడ్డ వైసీపీ కౌన్సిలర్ వరలక్ష్మి కుమారుడు సుధాకర్. తీసుకున్న అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ప్రియుడితో కలిసి భర్తను హత మార్చింది భార్య. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో గత కొంతకాలంగా భర్త స్వామి, భార్య కావ్య నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కారు డ్రైవర్ తో అక్రమసంబంధం పెట్టుకున్న కావ్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కిరాతకంగా చంపింది. పథకం ప్రకారం భర్తను ప్రియుడితో కలిసి కిడ్నాప్ చేసి నిజామబాద్ లో చంపింది భార్య. అనంతరం భర్త మృతదేహంను జవహర్ నగర్…
హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్ చేసి బంధించి కారులో తరలిస్తుండగా ఆత్మకూరు (మం) భైర్లుటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు.. కిడ్నాపర్లు వ్యక్తి బంధువుల నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురేంద్రను రక్షించారు పోలీసులు. రాయదుర్గం నుంచి కిడ్నాపర్లు కారులో నల్లమల అడవులకు…
Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. పాఠాలు నేర్పాల్సిన గురువు.. ప్రేమ పాఠాలు బోధించాడు.. తాను ప్రేమిస్తున్నాను అని నమ్మబలికాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు పెళ్లి అయిపోయింది.. అంటూ ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 9.30 గంటలకు ఝాన్సీ రోడ్డులోని బస్టాండ్‌లో ఒక అమ్మాయి తన కుటుంబంతో సహా దిగింది. అయితే ఆ సమయంలో.. తన తమ్ముడిని టాయిలెట్‌కు తీసుకెళ్దామని సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లింది. ఇంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఇద్దరు అగంతకులు.. బలవంతంగా యువతిని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు.
Dhoni: జార్ఖండ్ రాజధాని రాంచీలో కిడ్నాప్‌కు సంబంధించిన ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో నటిస్తూ ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేశారు కిరాతకులు.