ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదని మండిపడ్డారు. అవినాష్ తో కలిసి తన మీద రెండుసార్లు కామెంట్ చేశారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబు, లోకేష్ గురించి నాని మాట్లాడితే తాను ఖండించే వాడినని తెలిపారు. తాను సమర్థుడు కాదని కేశినేని నానీ అంటున్నారు.. సమర్థుడు అంటే పార్టీలు మారడమా అని విమర్శించారు. తాను అనేక మార్లు ఎమ్మెల్యే, ఎంపీగా…
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లపై వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి వంద మంది రావటం కూడా కూడా గగనమేనని ఎద్దేవా చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్‌ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం ఆయన వ్యాఖ్యానించారు. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత..?.. తిరిగి చెల్లించింది ఎంత..?.. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని.. చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు.
విజయవాడ ఎంపీ కేశినేని రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు.
కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్ - గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేశినేనిని చంద్రబాబు అవమానించారని అవినాష్ అన్నారు. అంతేకాకుండా.. క్యాష్ కొట్టు.. సీటు పట్టు అనే విధానం టీడీపీలో ఉందంటూ అవినాష్ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో.. అవినాష్ కు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కౌంటర్ ఇచ్చారు.