Buddha Venkanna: కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buddha Venkanna: ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం ఆయన వ్యాఖ్యానించారు. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత..?.. తిరిగి చెల్లించింది ఎంత..?.. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. కేశినేని నాని కబ్జాలు చేశారని ఆయన ఆరోపించారు. కేశినేని నానికి భయం మొదలైందని ఎద్దేవా చేశారు. తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయి కాబట్టే.. గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పాడన్నారు. టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకునే వాడు కాదని.. కానీ ఇవాళ తాను పాల్గొన్న కార్యక్రమంలో దేవినేని అవినాష్‌ను పక్కన పెట్టుకున్నారని తెలిపారు. అవినాష్ పక్కన లేకుంటే తంతారని కేశినేని నానికి భయం పట్టుకుందన్నారు.
Read Also: MP Vijayasai Reddy: మూడు లిస్టులు రిలీజ్ చేశాం.. త్వరలో మరో జాబితా..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
సూర్యకాంతం పేరు ఆడపిల్లలకు పెట్టడానికి భయపడతారు.. నాని పేరు మగపిల్లలకు పెట్టడానికి భయపడుతున్నారన్నారని ఆయన అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి వీరంగం వేస్తే కొడతారంటూ ఆయన పేర్కొన్నారు. కేశినేని నాని ఓ ఛీటర్, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి అంటూ మండిపడ్డ బుద్దా వెంకన్న.. 2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారన్నారు. గతంలో లగడపాటికి కేశినేని నాని ఫోన్ చేసి.. వాళ్ల పార్టీలో చేరుతానన్నారని ఆయన చెప్పారు. వద్దులే అంటూ కేశినేని నానిని లగడపాటి తిరస్కరించారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న కేశినేని నానికి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చిందన్నారు. వైసీపీ పని అయిపోవడం వల్లే కేశినేని నాని వంటి వారికి జగన్ టిక్కెట్ ఇచ్చారని ఆయన తెలిపారు. కేశినేని నాని శాడిస్టు ముదిరి సైకోలా మారారని.. నాని కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Read Also: Jogi Ramesh: పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను సిద్ధం..
చంద్రబాబు-లోకేషులను అబ్బా కొడుకులంటావా..?.. కేశినేని నానిని.. ఆయన కూతురును కానీ మేం అనగలం.. కానీ సంస్కారం అడ్డొస్తుందన్నారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. కేశినేని నాని ఓ బచ్చా. కేశినేని నాని కౌన్ కిస్కా గొట్టం. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు.. నువ్వు చేశావా..? కేశినేని నాని నువ్వెంత.. ? నీ బతుకెంత..?. జగన్ను చెల్లి ఛీ కొట్టింది.. నానిని చిన్ని ఛీ కొట్టాడు. కండువా కప్పుకోకుండానే కేశినేని నానికి సీటిచ్చారంటేనే ఆ పార్టీ పరుస్థితేంటో అర్థం అవుతోంది. నిన్నటి వరకు కేశినేని నాని వెంట ఉన్నారు.. నాని పార్టీ మారితే తిరస్కరించారు. కేశినేని నానిని తిరస్కరించిన కార్యకర్తలకు సెల్యూట్. జగన్ దగ్గరకు వెళ్లినప్పటి నుంచే కేశినేని నానికి కౌంట్ డౌన్ మొదలైంది.” అని బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!