Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లపై వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి వంద మంది రావటం కూడా కూడా గగనమేనని ఎద్దేవా చేశారు. గద్దె రామ్మోహన్ సమావేశాలకు 25 మంది వస్తే ఎక్కువ అని అన్నారు. తాను టీడీపీలో ఉన్నపుడే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని అవినాష్‌కు చెప్పానన్నారు. నేను చెప్పిందే అవినాష్ విషయంలో జరిగిందని కేశినేని పేర్కొన్నారు.
Read Also: Breaking: మరో 3 రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు..
చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదని.. చంద్రబాబు వంద కోట్లు కూడా బెజవాడకు కేటాయించలేదని తీవ్రంగా మండిపడ్డారు. చెన్నై తరహాలో ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయాలనుకుంటే.. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను చంద్రబాబు చెడగొట్టారని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీస్ రికార్డుల్లో కూడా ఈ విషయం ఉంటుందన్నారు. నటనను చంద్రబాబు దగ్గర చూశానని.. నిజాయితీని జగన్ మోహన్ రెడ్డి దగ్గర చూశామన్నారు. పార్టీ పరంగా వైసీపీకి ఉన్న బలంలో 10 శాతం కూడా టీడీపీకి లేదన్నారు. మూడోసారి ఎంపీగా గెలుస్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు.