Kesineni Nani: తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రారు అంటూ జోస్యం చెప్పారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.. కేశినేని భవన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. దేశచరిత్రలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని గుర్తుచేశారు. ఈ దేశంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీఆర్.. ఆయన తర్వాత పేదల కోసం పాటుపడిన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు.
Read Also: Balayya: నాన్నగారు నేటి తరానికి కూడా స్ఫూర్తి…
ఇక, ఎన్టీఆర్, వైఎస్సార్ బాటలో నడుస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వారిద్దరికంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసలు కురిపించారు ఎంపీ కేశినేని నాని.. మరోవైపు.. చంద్రబాబును ఎవరూ పట్టించుకోరు.. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రాడు అంటూ వ్యాఖ్యానించారు. 2014లో గెలిచాక చంద్రబాబు ఏవో అద్భుతాలు చేస్తాడని మేం భావించాం.. కానీ, కేవలం తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందని దుయ్యబట్టారు. కాగా, వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడంలేదనే సంకేతాలను టీడీపీ అధిష్టానం కేశినేని నానికి ఇవ్వడంతో.. క్రమంగా పార్టీ దూరమై.. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కావడం.. ఆ తర్వాత వైసీపీ లిస్ట్‌లో విజయవాడ లోక్‌సభ స్థానాన్ని కేశినేని నానికి కేటాయించడం జరిగిపోయిన విషయం విదితమే.