Kesineni Chinni: ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరని ఆయన అన్నారు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
Read Also: Breaking: వైసీపీకి, ఎంపీ పదవికి కృష్ణదేవరాయలు రాజీనామా
ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదని కేశినేని చిన్ని పేర్కొన్నారు. కొడాలి నానిలా కేశినేని నాని కూడా బూతులు మాట్లాడుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. మేము గేట్లు తెలిస్తే వరదల రావడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.