కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదని మండిపడ్డారు. అవినాష్ తో కలిసి తన మీద రెండుసార్లు కామెంట్ చేశారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబు, లోకేష్ గురించి నాని మాట్లాడితే తాను ఖండించే వాడినని తెలిపారు. తాను సమర్థుడు కాదని కేశినేని నానీ అంటున్నారు.. సమర్థుడు అంటే పార్టీలు మారడమా అని విమర్శించారు. తాను అనేక మార్లు ఎమ్మెల్యే, ఎంపీగా మెజారిటీతో గెలిచానని.. లక్ష మెజారిటీతో 2014లో గెలిచిన కేశినేని మెజార్టీ 2019లోఎనిమిది వేలకు పడిపోయిందని అన్నారు.
Read Also: Mrunal Takur : క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న మృణాల్.. ఏం అందంరా బాబు..
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గత ఎన్నికలలో తకు మెజారిటీ పెరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తనకు మెజారిటీ పెరిగింది.. కేశినేని నానికి మెజారిటీ తగ్గిందని పేర్కొన్నారు. తాను సమర్దుడునా… కేశినేని నానినా.. నాని సమాధానం చెప్పాలని అన్నారు. కాగా.. తనకు రాజకీయ తల్లి తెలుగుదేశం అని తెలిపారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే గన్నవరం నుండి ఇండిపెండెంట్ గా గెలిచానని.. ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా తాను ఇండిపెండెంట్ గా గెలిచానన్నారు.
Read Also: Naga Vamshi: ఆ షో వేసి తప్పు చేశా… సలార్ కి దీనికి ఉన్న తేడా అదే
విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికలలో గెలిచిన తరువాత ఏపీ రాజధాని విజయవాడ చెప్పారు.. చంద్రబాబు అధికారంలో ఉండిన సమయంలో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం మూడు వందల కోట్లు కేటాయించేవారని అన్నారు. ఇది కేశినేని నాని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు ఎంత బడ్జెట్ కేటాయించారో చెప్పాలని ఎమ్మెల్యే కోరారు. కాంట్రాక్ట్ లకు డబ్బుకు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వానిది అని దుయ్యబట్టారు.