హర్యానాలో ఆమ్ ఆద్మీ-కాంగ్రెస్ మధ్య పొత్తు బెడిసికొట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా సీట్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది.
ఇది కూడా చదవండి: Viral : వరదల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది అధికారులకు మరణశిక్ష
హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఓటింగ్‌కి సమయం కూడా ఎక్కువగా లేదు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇంకా ఇండియా కూటమిలోని పార్టీల నేతలు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు 10 సీట్లు ఆశిస్తున్నారు. కానీ హస్తం పార్టీ నేతలు మాత్రం సింగిల్ డిజిట్ సీటుకు మాత్రం పరిమితం చేస్తోంది. అన్ని సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ తెగేసి చెబుతోంది. దీంతో చర్చలు డైలామాలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్‌తో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా పరిష్కారం కాలేదు. ఆప్‌కి 5-6 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీకి ఒకటి, లెఫ్ట్ పార్టీలకు ఒకటి ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆప్ నేతలు మాత్రం 10 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది.
ఇది కూడా చదవండి: Vijayawada Floods: తగ్గిన వరద.. మొదలైన బురద క్లీనింగ్ పనులు..
హర్యానా కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపక్ బబారియా మాట్లాడుతూ… ఆప్‌తో చర్చలు జరుగుతూ ఉన్నాయని.. ఆప్ నేత రాఘవ్ చద్దాతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆప్‌తో కలిసే ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరకుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు. బుధవారం వీరిద్దరూ రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరికి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Ganesh Chaturthi : ఎలాంటి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే మంచిది?.. ప్రతిష్ఠాపన విధానం.. శుభ ముహూర్తం?
#WATCH | Delhi: On alliance with various parties for Haryana Assembly elections, AICC in-charge of Haryana Deepak Babaria says, "… Currently we are speaking to the Aam Aadmi Party. One or two other parties have also approached, we will respond in a day or two. CPIM and the… pic.twitter.com/TaqcO6Eyq3
— ANI (@ANI) September 4, 2024