చంద్రబాబుకు సీఎస్, డీజీపీ శుభాకాంక్షలు
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ సీఎఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.. ఇక, చంద్రబాబును కలిసిన వారిలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.. మాజీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ సైతం కాబోయే ఏపీ సీఎంకు శుభాకంక్షలు తెలిపారు..
బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయింది..
తెలంగాణలో 2023లో 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు .. మరో చోట సీపీఐని గెలిపించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు వచ్చాయి.. పార్లమెంట్ ఎన్నికల ముందే చెప్పిన ఈ ఎన్నిక.. మా పాలనకు రెఫరెండం.. మా పాలన నచ్చితే బలాన్ని ఇవ్వండి అని ఆడిగాం.. పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమ్మకంతో రెఫరెండం అని చెప్పినా.. పార్లమెంట్ ఎన్నికలో 8 సీట్లు మాకు ఇచ్చారు.. ఇంకో 8 బీజేపీకి ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు వచ్చాయి మాకు.. వంద రోజుల పాలన తర్వాత మమ్మల్ని ప్రజలు మెచ్చుకున్నారు.. అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వేశారు.. 2019లో 3 ఎంపీలు గెలిచాం.. ఇప్పుడు 8 సీట్లు ఇచ్చారు ప్రజలు.. 119 నియోజక వర్గాల్లో 64 సీట్లు వచ్చాయి.. 64 సీట్లలో మెజార్టీతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా గెలిచామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
సెలవు రద్దు చేసుకున్న సీఐడీ చీఫ్ సంజయ్..
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. ఇక, ఆయన విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ జవహర్‌రెడ్డి అనుమతులు కూడా మంజూరు చేశారు.. కానీ, ఉన్నట్టుండి మళ్లీ తన సెలవులను రద్దు చేసుకున్నారు సీఐడీ చీఫ్ సంజయ్. సెలవులపై విదేశాలకు వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.. సీఐడీ చీఫ్ సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు సంజయ్ సెలవుపై విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ మొదలైంది.
మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ.. ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును కూడా మోడీ సమం చేశారు. జూన్ 8 న మూడవ సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకరం చేయనున్నారు. జూన్ 8 సాయంత్రం కేంద్రంలో నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగింది. జూన్ 7 మధ్యాహ్నం బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ అధికారికంగా నాయకుడి ఎన్నిక జరుగుతుంది. జూన్ 8 న బిజేపి నేతృత్వంలో కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
అధికారంలో భాగస్వామ్యం.. పవన్ కీలక వ్యాఖ్యలు
అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్.. ఈ సమావేశంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చే సింది జనసేన. సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కు శాలువా కప్పి సన్మానించారు వర్మ. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు జనసేనాని.. జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండింటి మధ్య సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. త్వరలో జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోందన్నారు. 24 గంటలు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండేలా పని చేయాలనేది నా కోరిక. అర్థరాత్రి, అపరాత్రుళ్లు కూడా జనసేన అందుబాటులో ఉండేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు.
ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యం..
ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎమ్మె్ల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కామినేని శ్రీనివాస్ను రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ, జి. మధుకర్, వేటుకూరి సూర్యనారాయణ రాజు శాలువ కప్పి సత్కరించారు. ఈ క్రమంలో.. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విజయం ప్రజలు ఇచ్చిన ప్రజావిజయం అని అన్నారు. ఏపీకి రాజధాని లేదు.. అది ఏపీ చేసుకున్న దురదృష్టమని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు మార్చినా అడిగే వాళ్ళు లేరని ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆరా మస్తాన్ లాంటి వాళ్ళను నమ్మి లక్షల మంది కోట్ల రూపాయలు పోగొట్టారని తెలిపారు.
ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ ఎవరో తెలుసా..?
2024 ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కాగా.. ఈ ఎన్నికల్లో కొందరు ముఖ్యమైన ఓటమిపాలైతే.. మరికొందరు తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. కాగా.. నిన్న గెలిచిన వారిలో కాంగ్రెస్ ఎంపీగా సంజనా జాతవ్ కూడా ఉన్నారు. ఈమె ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించింది. సంజనా జాతవ్ వయస్సు (25). జాతవ్ 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై విజయం సాధించారు.
కేజ్రీవాల్‌కి బిగ్ షాక్..బెయిల్‌ని తిరస్కరించిన కోర్టు..
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. మార్చి నెలలో కేజ్రీవాల్ అరెస్టు జరిగితే, ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు మే నెలలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో 21 రోజుల పాల్గొన్న తర్వాత ఆయన జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిని కోర్టు తిరస్కరించింది. వైద్య కారణాలతో తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మధ్యాహ్నం తిరస్కరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉంటారు.
ఏపీ శాసనసభ రద్దు..
ఏసీ శాసనసభ రద్దు అయింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జగన్ తన పదవి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దు అయింది. కాగా.. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ 144కు గానూ 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70 వేల మెజార్టీతో గెలిచారు. నారా లోకేశ్ మంగళగిరిలో అత్యధికంగా 91 వేల మెజార్టీతో గెలుపొందారు.
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో యువకుడు మృతి.. నిజామాబాద్లో ఘటన
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మరీ పెద్ద వయస్సు వాళ్లు ఈ ప్రమాదంలో చనిపోతున్నారా అంటే అది కాదు.. చిన్న పిల్లలు నుంచి మొదలుపెడితే, యువకుల్లోనే గుండెపోటు ప్రమాదాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ముంబైలో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఓ యువకుడు గుండెపోటుకు బలయ్యాడు.
వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లిన యువకుడు శవంగా తిరిగివచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు. దీంతో.. తన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు తీవ్రంగా ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మరీ పెద్ద వయస్సు వాళ్లు ఈ ప్రమాదంలో చనిపోతున్నారా అంటే అది కాదు.. చిన్న పిల్లలు నుంచి మొదలుపెడితే, యువకుల్లోనే గుండెపోటు ప్రమాదాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ముంబైలో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఓ యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లిన యువకుడు శవంగా తిరిగివచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు. దీంతో.. తన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు.