ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. బంగ్లా పునరుద్ధరణ పనుల్లో అక్రమాలు జరిగాయాంటూ బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా… లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు ఫిర్యాదు చేశారు. ఎల్జీ ఆదేశాలతో ఫిబ్రవరి 13న కేంద్ర ప్రజా పనుల శాఖ నివేదిక సమర్పించింది. తాజాగా పునరుద్ధరణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ ఖజానాను విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తుకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Gold Price : త్వరపడండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు
కేజ్రీవాల్.. ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌స్టాప్ రోడ్‌లోని బంగ్లాలో 2015 నుంచి 2024 వరకు నివాసం ఉన్నారు. ఆ సమయంలో బంగ్లా పునర్ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ ఖజానాను వృధా చేశారని బీజేపీ ఆరోపించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీ దగ్గర నుంచి బీజేపీ అగ్ర నేతలంతా ఈ విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేశారు. ‘శీష్ మహల్’ అంటూ ఆరోపణలు గుప్పించింది. మొత్తానికి ఆప్ అధికారాన్ని కూడా కోల్పోయింది. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ హయాంలో జరిగిన అవకతవకలపై కేంద్రం దృష్టి సారించింది.
ఇది కూడా చదవండి: AP CS Vijayanand: స్వచ్ఛతకే ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ముఖ్యమంత్రి పేరును ఇంకా ప్రకటించలేదు. ఇందుకోసం అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. మహిళలకు ఛాన్స్ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రిగా అవకాశం ఉండే ఛాన్సుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్త ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’ ఉండరని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరేంటే.?