ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. అంతేకాకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ముఖ్య నాయకులంతా ఓటమిలో వరుస క్యూ కట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో కేజ్రీవాల్, ఆప్ ఓటమిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోస్టుమార్టం నిర్వహించారు. ఓటమికి గల కారణాలను వెల్లడించారు. లిక్కర్ స్కామ్‌లో బెయిల్ పొందిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం వ్యూహాత్మక పెద్ద తప్పు అని తేల్చారు. అరెస్టైనప్పుడే కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే బాగుండేదన్నారు. ఇక పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత.. అనంతరం ఇండియా కూటమిలో చేరడం.. మళ్లీ అందులోంచి బయటకు రావడం హెచ్చుతగ్గుల వైఖరి కనిపించింది అని చెప్పారు. దీంతో కేజ్రీవాల్ విశ్వసనీయత దెబ్బతీసిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: హమాస్‌కు హెచ్చరిక జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు
ఇక ఎన్నికల ముందు వేరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం ఘోర తప్పిందం అన్నారు. దీంతో బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోవల్సి వచ్చిందని విశ్లేషించారు. వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ మేథోమథనం చేసి చెప్పారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ఉద్దండులంతా ఓటమి చెందారు. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ.. ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయలేదు. అయితే మహిళను ముఖ్యమంత్రిగా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దళిత ముఖ్యమంత్రి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Fire Accident: పాతబస్తీలో 400 బట్టల దుకాణాలు దగ్ధం.. 24 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది!