Delhi Election Results: ఆప్‌లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు.. కారణమిదేనా?
- ఆప్‌లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు
- కేజ్రీవాల్, సిసోడియాను దెబ్బకొట్టిన లిక్కర్ స్కామ్
- ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్, సిసోడియా ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది. ఇంకేముందు తాజా ఫలితాల్లో నేలకొరిగేలా చేసింది. ఓటర్లు కొట్టిన దెబ్బతో కోలుకోలేని స్థితిలో పడ్డారు.
ఇది కూడా చదవండి: Anshu: 15 ఏళ్లకే మన్మధుడు.. అందుకే ఇండస్ట్రీ వదిలేశా.. ఇప్పుడు ఎంట్రీ ఎందుకంటే?
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పొందారు. నూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, జంగ్‌పురా నుంచి సిసోడియా ఓటమి పాలయ్యారు. పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్, తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా ఓడిపోయారు. ఆప్ అధినేతను 4,000 ఓట్ల తేడాతో పర్వేష్ వర్మ ఓడించారు. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురిపై అతిషి విజయం సాధించారు.
కొంపముంచిన లిక్కర్ స్కామ్..
కేజ్రీవాల్, సిసోడియా ఓటమికి ప్రధాన కారణం లిక్కర్ స్కామే అని చెప్పక తప్పదు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్.. ముగ్గురు జైలుకెళ్లారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ పరిస్థితి మసకబారింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక.. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి.. ఆ పీఠంపై నమ్మకస్థురాలైన అతిషిని కూర్చోబెట్టారు. తిరిగి ప్రజలు అధికారం ఇస్తేనే ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం పూనారు. తాజా ఫలితాలు చూశాక..కేజ్రీవాల్‌ను విశ్వసించలేదని అర్థమైంది.
ఇది కూడా చదవండి: Rajamouli: గతానికి భిన్నం.. వేట మొదలెట్టిన జక్కన్న!
అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ దగ్గర నుంచి అమిత్ షా.. ఇలా బీజేపీ అగ్ర నేతలంతా కేజ్రీవాల్ ‘‘శేష్ మహాల్’’ అంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర స్కామ్ డబ్బులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వీడియోలు, ఫొటోలు వైరల్ చేశారు. ఇవి వేగంగా ప్రజల్లో చొచ్చుకెళ్లాయి. ఇవే కేజ్రీవాల్‌ను కొంపముంచాయని చెప్పక తప్పదు. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఆప్ అభ్యర్థులను ప్రకటించడం.. ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. అన్ని వర్గాలకు ఉచిత హామీలు కూడా ఇచ్చేశారు. అయినా కూడా ప్రజలు ఆప్‌ను విశ్వసించలేదు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!