MLC Jeevan Reddy: కేటీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో బస్సు ప్రమాదం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు వెళుతున్న బస్సు టైరు పగలడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్న పాలమూరు ప్రజల తరుపున మాట్లాడుతున్నానని, నీళ్ళు, నిధులు, నియామకాల పేరిట ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు పొందిం కేసీఆర్ కుటుంబమని సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లను ఆంధ్రోళ్లు దోచుకువెళ్తుంటే… చేతకాక చూస్తూ ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. కమిషన్ లు తీసుకొని కాళేశ్వరం కట్టి, కాంట్రాక్టులు ఆంధ్రోళ్లు కట్టబెట్టారని, నియామకాలు పాలమూరు జిల్లా ప్రజలకు రాలేదు కానీ కేసిఆర్ కుటుంబ సభ్యులకు వచ్చాయన్నారు వంశీ చంద్…
బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కాదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయారని.. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దని.. బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో ఏం జరిగిందో చూపించారని అన్నారు.…
Mallu Ravi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు.. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్లో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబందు అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తుంటి నొప్పితో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
BJP MP K. Laxman: ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసిందని, మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ K.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కన్వెన్షన్ లో దేశ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారన్నారు.